ఈ రోజుల్లో మొబైల్ తోనే చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఆరు బయట ఆటలు కనుమరుగైపోయాయి. ఒకప్పుడు చిన్న పిల్లలు వీధుల్లో ఎక్కువగా ఆడుతూ పాడుతూ కనిపించేవారు. ఆ చిన్ననాటి పాటలను ఒక్కసారి గుర్తుకు చేసుకుందాము ఒకసారి.
ఉగ్గు జీర్ణం
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుణ్ణము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై
బీముడు తిన్న పిండివంటలు జీర్ణమై
అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణమై
అబ్బాయి తిన్న పాలు, ఉగ్గు జీర్ణమై
కుందిలాగ కూర్చోని నందిలాగా ప్రాకి
లేడిలాగ లేచి తాంబేలులాగ తాళి
దాగుడుమూత
దాగుడుమూత దండాకోర్
ఎక్కడదొంగ లక్కడే
పిల్లేవచ్చే ఎలుకా దాక్కో గప్ చిప్
దొంగకు జుట్టుచ్చి మూలను కోలపోసి
అబ్బాయికి పాలిచ్చి ఆదుకొని వద్దాం